Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

జగన్మోహన్‌ రెడ్డితో మీరు పోల్చుకోకండి

పవన్‌ కల్యాణ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం విసుర్లు
పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి యాక్టర్‌..రాజకీయాలు గురించి పవన్‌ కళ్యాణ్‌ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్‌ చేసుకుంటే మంచిదని హితవు పలికారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టి రాష్ట్రం అంతా తిరిగి.. రెండు ప్రాంతాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారన్నారు. జగన్మోహన్‌ రెడ్డితో మీరు పోల్చుకోకండి. ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. సీఎంను విమర్శించే ముందు పవన్‌, లోకేష్‌ విజ్ఞతతో ఆలోచించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img