Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఆపండీ నరమేధం

మరి అంతటితో ఆగకూడదు
ఉదయించాలి నవ స్వతంత్ర పలస్తీనా దేశం
అంతమవ్వాలి ఇజ్రాయిలీ పైశాచికత్వం
అదే సమస్యకు పరిష్కారం
మొలకెత్తుతున్న విత్తనాన్ని
నలిపేస్తున్నారు నయా నాజీలు
అసంరా అందిస్తోంది అభయ హస్తం
గొప్ప ప్రజా అస్వామ్యదేశం, మరి.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
అమెరికా కాదు అసంరా
రెండున్నాయి అమెరికా ఖండాలు
అనేక దేశాలు వాటిలో`
వాటిలో ఒకటి మాత్రమే అసంరా
అదే కాదు అమెరికా
పలస్తీనా జిందాబాద్‌
జిందాబాద్‌ పలస్తీనా
జిందాబాద్‌ పలస్తీనా!
డా॥ తక్కోలు మాచిరెడ్డి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img