Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అఫ్ఘాన్‌ పరిస్థితిపై ప్రత్యేక బృందం

అఫ్ఘానిస్తాన్‌ విషయంలో భారత్‌ తక్షణం చేపట్టవలసిన చర్యలను గుర్తించాలని అత్యున్నత స్థాయి అధికారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. అఫ్ఘ్ఘానిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించడానికి ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులు, అప్ఘాన్లు, మైనారిటీలను భారత దేశానికి సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యతలను ఈ బృందానికి అప్పగించారు. ఆఫ్ఘానిస్తాన్‌్‌ సంక్షోభం గురించి గత కొద్ది రోజులుగా ప్రతి నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్న వారితో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అఫ్ఘానిస్తాన్‌లో భారత్‌ తక్షణ ప్రాధాన్యతలపై దృష్టి సారించనుంది.అఫ్ఘానిస్తాన్‌లో క్షేత్ర స్థాయి పరిస్థితులను, అంతర్జాతీయ స్పందనలను కూడా ఈ బృందం పర్యవేక్షిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని కూడా పరిశీలిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img