Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024

14వతేదీజరగనునిరసనకార్యక్రమాలనుజయప్రదం చేయండి


—–— కార్మిక రైతు సంఘాల పిలుపు
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగాఈనెల14వ తేదీజరిగే నిరసన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్వాసులు పిలుపునిచ్చారు బుధవారం నెల్లూరులోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగాలపై ఏకపక్షంగా దాడులు చేయటాన్ని నిరసిస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న రైతన్నలపై అక్రమ కేసులు బలయించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనిపోరాటంచేయవలసిన దుస్థితిఏర్పడిందని, ఎన్నో సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను కాలరాశి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొని వచ్చి కార్మికుల హక్కులను కాలర్ రాస్తున్నారని తక్షణం ఈ నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దొడ్డిదారిన నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ వ్యవసాయ రంగాన్ని ఆదాని
అంబానీలకుదారాదత్తంచేస్తుందని వారుఆరోపించారు.రానున్నఎన్నికలలోబిజెపినిఓడించాలనిప్రజాస్వామ్యాన్నిలౌకికవాదాన్నిపరిరక్షించుకోవాల్సినబాధ్యతమనఅందరిపైనఉన్నదని వారన్నారు.ఈసమావేశంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ముదివర్తి బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img