Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

30న బెంగాల్‌, ఒడిశాల్లో ఉపఎన్నికలు..

దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉపఎన్నిక
పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్‌ (ఈసీ) విడుదల చేసింది.ఈ నెల 30న బెంగాల్‌లో భవనీపూర్‌, జంగీపూర్‌, శంషేర్‌గంజ్‌, స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు, అదేరోజున ఒడిశాలోని పిప్లి అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ ఉపఎన్నికల్లో పోలైన ఓట్లను అక్టోబర్‌ 3న లెక్కించి ఫలితాలు వెల్లడిరచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలవవలసిన అవసరం ఉంది. భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేబ్‌ ఛటోపాధ్యాయ్‌ రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది.
కాగా పండుగ సీజన్‌ ముగిశాకే ఉపఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడిరచింది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఉపఎన్నిక ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఏపీలోని బద్వేల్‌ ఉపఎన్నిక కూడా దసరా తర్వాతే ఉండనున్నట్లు తెలిపింది.ఈ మేరకు ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కూడా కోరినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img