Friday, May 10, 2024
Friday, May 10, 2024

ఎండాకాలంలో అదనపు తరగతులు నిర్వహించరాదు.. మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్.


విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఎండాకాలం అధికంగా ఉన్నందున ఏ ఒక్కరూ కూడా అదనపు తరగతులు నిర్వహించరాదని మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఎండాకాలంలో ఉండాల్సిన పద్ధతులపై విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలని తెలిపారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి కూడా ఆయా పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రస్తుతం పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో ఎండ అధికంగా ఉన్నందున పై సూచనలు తప్పక పాటించాలని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుల వద్ద, బావుల వద్దకు ఈతకు పంపరాదని, సరియైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉందని తెలిపారు. ఎండలు అధికంగా ఉన్నందున గొడుగులు వాడుకోవాలని తెలిపారు. నీరును అధికంగా సేవించాలని తెలిపారు. ఆరోగ్య విషయాలపై విద్యార్థులు నిర్లక్ష్యంగా ఉండరాదు అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img