Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

బెంగాల్‌ బీజేపీలో లుకలుకలు

అరుణ్‌ శ్రీ వాస్తవ
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికలకమిషన్‌ ప్రకటనచేసింది. ఉపఎన్నికల్లో మమతాబెనర్జీ గెలు పొంది ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీకి కమిషన్‌ ప్రకటన షాకిచ్చింది. ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి అని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల నిర్వహణపై బీజేపీలో విభేదాలు ఉన్నాయి. ఉప ఎన్నికలు నిర్వహించి మమతాబెనర్జీకి ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వరాదని నరేంద్రమోదీ, అమిత్‌షాలు వ్యూహంపన్నినవిషయం రహస్యమేమీకాదు. మమత ప్రభుత్వాన్ని అస్థిరీకరించి పార్టీలో చీలిక తీసుకు వస్తే తమ పార్టీకి పాలనావకాశాలు ఉంటాయన్న ఆలోచన కూడా నేతలకు లేకపోలేదు. కుట్ర లకు పాల్పడి మమత ప్రభుత్వాన్ని రద్దుచేస్తే ఇప్పటికే తగ్గిన మోదీ పలుకుబడి మరింత తగ్గవచ్చునని భావించి ఉపఎన్నికల నిర్వహణకు సానుకూలంగా ఇద్దరు నేతలు మారారని తెలుస్తోంది. 66 శాతం ఉన్న ప్రజాదరణ ఇటీవల అనేక సర్వేలలో 21 శాతానికి పడిపోయిందని స్పష్టమైంది. తాజాగా వెలువడిన సర్వేలు మాత్రం ఆయన పలుకుబడి తగ్గలేదని చెప్తున్నాయి. ఇది సొంతసర్వే అయి ఉండవచ్చు కూడ.
తొమ్మిది నెలలుగా రైతులు చేస్తున్న మహత్తర పోరాటం మరింత క్రియాశీలమై నూతన ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇది మోదీ, షాలను ఆందో ళనకు గురిచేసింది. అలాగే దిగువ స్థాయిలో మోదీ గొప్పవాడని ఇంతకాలం ప్రచారం చేస్తూ వస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల్లో లుకలుకలు ఏర్ప డ్డాయి. సంప్రదాయ భ్రాహ్మణ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలలో ఈసారి ప్రత్యర్థులుగా మారిపోయారు. అయితే నాయకత్వాన్ని ఎదిరిస్తున్నట్లు బహి రంగంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు మాట్లాడరు. మౌనంగా ఉండి నాయకుల ఆదేశాలను తిరస్కరిస్తుంటారు. ఇప్పుడు కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణ యాన్ని అమలుచేసేందుకు సిద్ధంగాలేరు. జిల్లాస్థాయి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు, రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులకు మధ్య విధేదాలు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు పునరుత్తేజం కల్పించాలంటే కింది స్థాయి కార్యకర్తల విశ్వాసాన్ని రాష్ట్ర నాయకులు పొందవలసిందే. గ్రామ స్థాయిలో ఉండే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు రైతుల దుస్థితి బాగా అర్థమైంది. వీరిని మోదీషాలు అవమాన పరుస్తున్నారని కూడా గ్రామ స్థాయి కార్యకర్తలు విమర్శిస్తున్నారు. రైతుల ఉద్యమానికి పెరుగుతున్న తోడ్పాటు మోదీషా ధ్వయాన్ని తీవ్రఆందోళనకు గురి చేస్తోంది. రైతుల సమస్యపైన ఈ ఇద్దరు నాయకులను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.
మమత విషయంలో కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేంద్ర నాయకులు తీసుకున్న వైఖరిని రాష్ట్ర నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల్లో మమత పోటీచేయకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించి నిలువరించాలన్నది రాష్ట్ర నాయకుల యోచన. మమత పోటీచేయనున్న భవానీపూర్‌లో ఎన్నికలు నిర్వహించ కుండా అడ్డు పడేందుకు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ఘోష్‌ చెబుతున్నారు. ఈ విషయంలోను గ్రూపు తగాదాలు బయట పడ్డాయి. అమిత్‌షాకు ఇష్టుడైన సుభేందు అధికారిని మమతపై ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని కొందరు నాయకులు పట్టుబడుతుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రుద్రనీల్‌ ఘోష్‌ను పోటీ చేయించటానికి మరికొందరు నాయకులు ఇష్టంగా లేరు. మమతపై పోటీ పెట్టటమా, లేకపోతే కోర్టును ఆశ్రయించటమా అన్న విషయంలో విభేదాలు తలెత్తాయి. ఎన్నికల నిర్ణయాన్ని తీసుకున్న కమిషన్‌ను రుద్రనీల్‌ ఘోష్‌ తదితరులు తప్పుపడుతున్నారు. సుభేందును వ్యతిరేకిస్తున్న నాయకులు ఇప్పటికే కేంద్ర నాయకత్వాన్ని సంప్ర దించారు. తానే తదుపరి ముఖ్యమంత్రినని సుభేందు ప్రచారం చేసుకుంటు న్నట్టుగా కేంద్ర నాయకులకు సమాచారం ఇచ్చారు. ఉప ఎన్నికలను వాయిదా వేయకుండా తమకు నష్టం కలిగించారని ఎన్నికల కమిషన్‌ పైన బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఉప ఎన్నికలు జరుగుతాయని తాము ఎంత మాత్రం అనుకోలేదని అంటూ మమతపై పోటీ చేయించటానికి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
భవానీపూర్‌ నుంచి ఉప ఎన్నికల్లో మమత పోటీ చేస్తారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆదివారం ప్రకటించింది. పోలింగు సెప్టెంబరు 30వ తేదీన జరుగు తుంది. జంగిపూర్‌, శాంసర్‌గంజ్‌ నియోజక వర్గాల్లో జకీర్‌ హుస్సేన్‌, అమ్రుల్‌ ఇస్లామ్‌ను పోటీ చేయించాలని తృణమూల్‌ నిర్ణయించింది. ఇదే సమయంలో రాష్ట్రాన్ని విడగొట్టి ఉత్తర బెంగాల్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై రాష్ట్ర నాయకులు ఆందోళన చేయాలని కేంద్ర బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో రాష్ట్ర నాయకులతో కేంద్ర నాయకులు ప్రత్యేక రాష్ట్ర అంశంపై సమావేశాన్ని జరుపుతారని డార్జిలింగ్‌ బీజేపీ ఎంపీ రాజు బిస్టా చెప్పారు. డార్జిలింగ్‌ ప్రాంతంలో రాజకీయంగా సానుకూల వాతావర ణాన్ని కల్పించేందుకు అమిత్‌షా ఉత్తరబెంగాల్‌లో ఈ నెలలోనే పర్యటిస్తారని రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అమిత్‌ షా ఉత్తర బెంగాల్‌లో పర్యటించటం మొదటిసారి. ఈ ప్రాంతంలోని 54 సీట్లలో బీజేపీ 30 సీట్లు గెలుచుకుంది. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న డార్జి లింగ్‌లో రాజకీయ పరిష్కారం కోసం నేషనల్‌ గూర్ఖాలాండ్‌ తదితర సంస్థలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. ఉత్తర బెంగాల్‌ను ప్రత్యేక రాష్ట్రంగా లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్ర సహాయ మంత్రి జాన్‌ బర్లా, ఎంపీ అలీ పుర్దార్‌ ఇప్పటికే కోరారు. కేంద్రంలో మరో సహాయ మంత్రి నితీష్‌ ప్రమాణిక్‌ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img