Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

షుగర్ వ్యాధి పట్ల ప్రజలు తప్పక అప్రమత్తంగా ఉండాలి..

స్పందన హాస్పిటల్..డాక్టర్ బషీర్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు షుగర్ వ్యాధి పట్ల తప్పక అప్రమత్తంగా ఉండాలని, తద్వారా ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉందని స్పందన అధినేత డాక్టర్ బషీర్, సతీమణి డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు జాతీయ మధుమేహ వ్యాధి వారోత్సవాలు సందర్భంగా వాళ్ళ విషయాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మధుమేహం (షుగర్ వ్యాధి) వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఆ వ్యాధి వస్తుంది అన్నారు. యుద్ధ వయసులో ఉన్న వారిలో ఎక్కువగా ఈ వ్యాధి ప్రభావం చూపుతుందని, మధుమేహ సమస్యల నివారణకు అధిక ప్రమాద జనాభాలో రక్తంలో చక్కెరలను క్రమం తప్పకుండా పరీక్షించడం చాలా ముఖ్యమన్నారు. మధుమేహం యొక్క లక్షణాలు అస్పష్టంగా ఉంటాయని, జీవన శైలిలో మార్పులు చేయాలని, జాగింగ్,ఆటలు ఆడటం మితమైన తీవ్రతతో కూడిన వ్యాయామం చేయాలని తెలిపారు. మనిషి రక్తంలో గ్లూకోస్ శాతం సాధారణ కన్నా ఎక్కువగా ఉండే స్థితిని మధుమేహ వ్యాధి (డయాబెటిస్) అని అంటారని తెలిపారు. ఈ వ్యాధి అనేక రకాలుగా ఉంటుందని టైప్ వన్ డయాబెటిస్, టైప్ టు డయాబెటిస్, గర్భిణీ స్త్రీలలో డయాబెటిస్, ఇతర కార్యాలయం వల్ల వచ్చే డయా బే టిష్ ఉంటాయన్నారు. ఈ వ్యాధి శరీరంలో ఉన్నప్పటికీ దాని లక్షణాలు బయటపడడానికి కొన్నిసార్లు దాదాపు 5 సంవత్సరాల పైనే పట్టవచ్చునని తెలిపారు. కావున లక్షణాల కోసం ఎదురు చూడకుండా అప్పుడప్పుడు రక్తంలో గ్లూకోస్ పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది అని తెలిపారు. తద్వారా ముందుగానే డయాబెటిస్ ను గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాధి ఉన్నవారు ఆహారం పట్ల సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని సిరంజి ద్వారా, పెన్ ద్వారా లేక పంపు ద్వారా వేసుకోవాల్సి ఉంటుందని స్వయంగా వేసుకోవడం నేర్చుకోవాలని తెలిపారు. ప్రతినెల వైద్యున్ని సంప్రదించాలని, అవసరమైతే ఫోన్ ద్వారా అయినా కూడా సంప్రదించి బీపీ చెక్ చేయించుకోవాలని తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలలో ఎక్కువ దప్పిక, ఎక్కువ ఆకలి, ఎక్కువ మూత్ర విసర్జన, బరువు తగ్గడం లాంటివి అని తెలిపారు. ఇన్సులిన్ వాడకపోతే డయాబెటిస్ లో కిటో ఆసిటోసిస్ అనే ప్రమాదకర స్థితి ఏర్పడుతుందని తెలిపారు. సాధారణంగా 45 సంవత్సరాలు పైబడిన వారిలో గాని, అంతకన్నా చిన్నవయసులో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అవసరమైన సమయాలలో తప్పక అనుకూలమైన ఆసుపత్రిలో రక్తపరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ వ్యాధి ఉన్నవారు ఆహారాన్ని ఒకే మారుకాకుండా పలుమార్లుగా విభజించుకొని భుజించాలని తెలిపారు. బ్రేక్ ఫాస్ట్ ను రెండు సమాన భాగాలుగా రెండు గంటలు తేడాతో కూడా భుజించవచ్చునని తెలిపారు. మహిళల్లో గర్భం దాల్చిక ముందే డయాబెటిస్ ఉంటే, గర్భం రాక మునుపే రక్తంలో గ్లూకోజులు నియంత్రణలో ఉంచుకోవాలని తెలిపారు. మూత్రపిండాలు, కన్ను, రెటీనా, రక్తపోటులు పరీక్షించుకోవాలని, ఒకవేళ రెటీనోపతి పెరిగే అవకాశం ఉన్నందున తరచూ రెటీనా పరీక్షలు కూడా చేయించుకోవాలని తెలిపారు. కావున ప్రజలు పై విషయాలను తప్పక పాటించి ఆరోగ్యాన్ని పదిలంగా చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img