Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

నన్ను ఆశీర్వదించండి… మన్యప్రాంత అభివృద్ధికి తోడ్పడతా

స్వతంత్ర అభ్యర్థిగా విష్ణుమూర్తి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే నన్ను నియోజకవర్గ ప్రజలు ఆదరించి అసెంబ్లీకి పంపిస్తే మన్య ప్రాంత సమస్యలపై ప్రజల యొక్క వానిని తన గళం ద్వారా వినిపించి మన్య ప్రాంత అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు కల్పించిన చట్టాలు, హక్కులపై శాసనసభలో ప్రజా గొంతుకను వినిపిస్తానని పాడేరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న అడపా విష్ణుమూర్తి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వైకాపా ఆవిర్భావం నుండి ఆ పార్టీలో సీనియర్ నాయకునిగా మన్య ప్రాంతంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశానన్నారు. 2018 వరకు తాను జీకే వీధి మండల వైకాపా అధ్యక్షుడిగా పనిచేశానన్నారు.తన మరదలు అడపా విజయ కుమారి జెర్రెల సర్పంచ్ గా పనిచేశారని, ప్రస్తుతం తన సతీమణి జెర్రెల ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారన్నారు. అయినప్పటికీ, ప్రస్తుతం ఉన్న నాయకత్వం తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడమే గాక, తన సేవలను గుర్తించకపోవడంతో మనస్థాపం చెందిన తాను గత కొంతకాలంగా తటస్థంగా ఉన్నానన్నారు. ప్రాంతంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రస్తుతం 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో పాడేరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నానన్నారు. పాడేరు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పంపినట్లయితే మన్యప్రాంత వాసుల అభిప్రాయాన్ని, గిరిజన చట్టాలు, హక్కుల రక్షణకై కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img