Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

పాడేరు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో తెదేపా మొండి వైఖరి విడనాడాలి

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినా గిడ్డి ఈశ్వరి వెంటే మేమంతా

చింతపల్లి మండల తెదేపా శ్రేణులు.

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిస్తే మేమంతా మీ వెంటే ఉంటామని మండలంలోని వివిధ పంచాయతీలకు చెందిన తెదేపా శ్రేణులు సోమవారం శపథం చేశారు . మండలం లోని తాజంగి పంచాయతీలో సుమారు 8 పంచాయతీలకు చెందిన తెదేపాశ్రేణులు గిడ్డి ఈశ్వరి యువ సైన్యం పేరిట ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ గా గిడ్డి ఈశ్వరి నాయకత్వంలో అహర్నిశలు శ్రమించమన్నారు. పార్టీ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తూ వైకాపా వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీగా ఎదుర్కొన్నామన్నారు. ఈశ్వరికి టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపించి అధిష్టానానికి బహుమతిగా అందిస్తామన్నారు. పార్టీ అభ్యర్థి ఎంపికలో అధిష్టానం పునరాలోచన చేసి గిడ్డి ఈశ్వరికి బీఫారం అందించి అధిష్టానం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. అధిష్టానం మొండితనంతో వ్యవహరించి పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు బి ఫారం అందిస్తే స్వతంత్ర అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరిని బరిలో నిలిపి అత్యధిక మెజార్టీతో విజయం సాధించి తీరుతామని ఈ సందర్భంగా వారు అధిష్టానాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్, ఐటీడీపీ ఇంచార్జ్ శ్రీధర్. పార్టీ నాయకులు కేశవ, రమణ, లోవరాజు, సత్యనారాయణ, చంటి, సుందర్, అధిక సంఖ్యలో కార్యకర్తలు యూనిట్ ఇన్చార్జులు, భూత్ కన్వీనర్లు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img