Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

అధిష్టానం పునరాలోచన చేసి గిడ్డి ఈశ్వరికి బీఫారం ఇవ్వాలి

తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి అభ్యర్థిత్వం ఖరారు చేయడంలో పార్టీ అధిష్టానం మీన మేషాలు లెక్కించడం మానుకొని ఆమెను అభ్యర్థి గా ప్రకటించి తెదేపా బి ఫరం అందించకపోతే స్వతంత్ర అభ్యర్థినిగా బరిలో నిలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీకి కనువిప్పు కలిగిస్తామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు, అరకు పార్లమెంటు బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం అన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సమావేశమైన వారు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికలలో గిడ్డి ఈశ్వరికి తెదేపా బీఫారం లభించకపోతే తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమన్నారు. గడచిన ఐదేళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన శ్రేణులంతా గిడ్డి ఈశ్వరి వెంటే ఉన్నారని, క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులు అందరూ ఏకతాటిపై తెదేపా తిరుగుబాటు అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరిని అత్యధిక మెజారిటీతో గెలిపించి తీరుతామని, తిరుగుబాటు అభ్యర్థిగా వచ్చే గుర్తును ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పార్టీ శ్రేణులంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img