Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమరవీరుల త్యాగం మరువలేనివి.. డీఈవో మీనాక్షి దేవి

విశాలాంధ్ర` ధర్మవరం : దేశం కోసం ప్రాణాలర్పించిన అమరువీరుల త్యాగం మరువలేనిదని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి దేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం రిటైర్డ్‌ ఆర్మీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో’’సాయిధ దళాల పతాక దినోత్సవ0’’ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని వన్టౌన్‌ సీఐ. సుబ్రహ్మణ్యం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రజల వద్ద షాపుల వద్ద దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాల సహాయ నిమిత్తం నిధిని కూడా వసూలు చేశారు. ప్రజల నుండి విశేష స్పందన రావడం జరిగింది. అనంతరం డిఇఓ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం మనందరి విధి అని తెలిపారు.’’దేశం నాకేమీ ఇచ్చింది అని కాకుండా దేశం కోసం నేను ఏమి చేశాను’’ అన్నది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని తెలిపారు. తదుపరి రిటైర్డ్‌ ఆర్మీ అసోసియేషన్‌ అధ్యక్షులు కొండారెడ్డి, గౌరవ అధ్యక్షులు పి. పెద్దిరెడ్డి, కార్యదర్శి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని రక్షించుటకు దేశ సైనికులు ఎంతో కష్టపడుతున్నారని, అన్నం, నిద్రలు లేక దేశ ప్రజల కోసం పాటుపడడం నిజంగా తీర్చుకోలేని రుణమని తెలిపారు. దేశ రక్షణలో ప్రాణాలు వొదిన అమరవీరుల కుటుంబాలకు ప్రతి ఒక్కరూ చేయూత ఇచ్చినప్పుడే అది మానవత అవుతుందని తెలిపారు. తదుపరి డిఇఓ మీనాక్షి దేవి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శైలజ ఉపాధ్యాయులు కలిసి నిధిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఆర్మీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, మహేశ్వర్‌, బాల స్వరూప్‌, శంకరప్ప, రామిరెడ్డి, నాగభూషణం, కొండన్న, సి. పెద్దిరెడ్డి, సుబ్బిరెడ్డి , వన్‌ టౌన్‌ ఎస్‌ఐ. గౌస్‌ పీరా, ఏఎస్‌ఐ. రఘురాముడు,పాఠశాల హెడ్మాస్టర్‌ శైలజ, పిఈ టి.నవీన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img