Friday, April 26, 2024
Friday, April 26, 2024

అవినీతి అక్రమాలకు… ముందు అభివృద్ధికి దూరం..

సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని మునిసిపల్ కార్యలయం దగ్గర శుక్రవారం సీపీఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ… వైసీపీ,టీడీపీ జనసేన నాయకులు జిల్లా ,రాయలసీమ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా మీరు ఎంత అవినీతి చేశారంటే మీరు ఎంత అవినీతి చేశారు అన్ని ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప ఈ జిల్లాలో అనేక మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో స్థానిక పరిశ్రమలు లేక అనేకమంది నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు జిల్లాలకు వలసలు వెళ్లి జీవనాన్ని గడుపుకునే స్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా నాయకులు కళ్ళు తెరిచి ఈ ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.కొన్ని ప్రైవేటు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్న వైద్యం చేయకుండా డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామనే విధంగా ప్రైవేట్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్నారు.వీటిపై వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోని పేదలకు ఆరోగ్య శ్రీ క్రింద వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.ప్రభుత్వ ఆసుపత్రిలో తరగతి ని బిల్డింగ్ పనులు పూర్తి చేసి ఆపరేషన్ థియేటర్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టి. కిడ్నీ డయాలసిస్ మొదలైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పట్టణంలో అనేక వార్డుల్లో త్రాగునీరు రోడ్లు కాలువలు వీధి లైట్లు ఇలా అనేక మౌలిక సదుపాయాలకు కల్పించకుండా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రధానంగా పట్టణ శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీలో తాగునీటి సమస్య రోడ్లు వీధి దీపాలు ఇలాంటి మౌలిక సదుపాయాలకు ఆమడ దూరంలో ఉన్నాయన్నారు., అర్హులైన పేదలందరికీ ఇళ్లు స్థలాలు ఇల్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల రుణాలు ఇవ్వాలని ఇలా అనేక సమస్యల పరిష్కారం కోసం దీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.రిలే దీక్షలో జగ్గలి రమేష్,
రాము నాయక్,సురేష్,మల్లి, సల్మాన్ రాజ్ ,రాము,కృష్ణ కుర్చున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు,మారుతి ప్రసాద్,కసాపురం రమేష్, ఐద్వా పట్టణ అధ్యక్షురాలు రంగమ్మ అబ్దుల్లా ఓబులేసు,షాషా,తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img