Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉత్తమ విద్యా బోధన ప్రభుత్వ కళాశాలలోనే లభిస్తుంది.. ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : నాణ్యమైన విద్య, అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు తో కలిగిన ప్రభుత్వ కళాశాలలోని నాణ్యమైన విద్య లభిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం కళాశాలలో ఁఆలోచించండి- వాస్తవాలను తెలుసుకోండి- ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి, చేర్పించండి ఁఅన్న గోడపత్రికలను ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి తో పాటు అధ్యాపకులు, విద్యార్థినీలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన, అంకితభావం కలిగిన అధ్యాపకులచే బోధన కళాశాలలో జరుగుతుందని,తెలుగు అకాడమీకు ఉచిత పాఠ్య పుస్తకాలను కూడా పంపిణీ చేస్తామని, స్కాలర్షిప్ సౌకర్యం కూడా కలదని ఆధునీకరించబడిన ప్రయోగశాలల సౌకర్యం కలదని తెలిపారు. స్వేచ్ఛ వాతావరణంలో మానసిక ఒత్తిడి లేని ఎదుగుదల, కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సిఇసి, హెచ్ఈసి, ఓఎ , ఎమ్మెటీ,ఎంపీ హెచ్డబ్ల్యూ నా గ్రూపులకు ఇంగ్లీష్ తెలుగు మీడియములలో బోధన ఉంటుందన్నారు. అంతేకాకుండా కళాశాలలో దాతల సహాయంతో ఉచిత మధ్యాహ్న భోజన పథకం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థినిలకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వారికి ఉచితంగా బస్సు పాస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. కావున తల్లిదండ్రులు, పట్టణ, గ్రామీణ, విద్యార్థినిలు పై సదుపాయాలను గమనించి, ప్రభుత్వ బాలికల కళాశాలలో చేరాలని వారు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img