Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డికి ఆహ్వానం

విశాలాంధ్ర -ఉరవకొండ : వజ్రకరూరు మండలం జరుట్ల రామపురం గ్రామంలో వెలిసిన దక్షిణ కాశీగా పిలువబడుతున్న రామలింగేశ్వర స్వామి దేవాలయము నందు శివరాత్రి పర్వదినాన పురస్కరించుకుని నిర్వహించే కళ్యాణోత్సవం మరియు రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డిని ఆ గ్రామ సర్పంచ్ తిరుపాలు యాదవ్, దేవాలయ కార్యనిర్వాహణాధికారి దేవదాసు శుక్రవారం ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శివరాం రెడ్డి మాట్లాడుతూ రథోత్సవము మరియు కల్యాణోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యములు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సోమర జయచంద్ర నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img