Friday, April 26, 2024
Friday, April 26, 2024

గర్భిణీలకు అన్నదానము

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ గ్రామాల నుండి వైద్య పరీక్షలు నిమిత్తం వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు వారి సహాయకులకు అనారోగ్యముతో హాస్పిటల్ కి వచ్చిన వారందరు వైద్య పరీక్షల అనంతరము ఆకలి దప్పులతో వారి గ్రామాలకు తిరిగి వెళ్ళరాదని నారాయణ సేవలో భాగంగా శుక్రవారం ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం జరిగిందని వాటర్ పాకెట్లను అందజేసినామనీ. ఈ కార్యక్రమమునకు పరిటాల శ్రీరాములు కళాశాలలో పనిచేయుచున్నటువంటి శ్రీమతి సంగీత ప్రతాప్ జన్మదిన సందర్భంగా సహకరించినారు, మరియు కళాశాల అధ్యాపక బృందం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ సేవా కార్యక్రమంలో సహకరించి, సేవలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని సత్యసాయి తాలూకా అధ్యక్షులు శంకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img