Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వడదెబ్బపై అవగాహన ర్యాలీ

విశాలాంధ్ర -బొమ్మనహల్: ఎండాకాలంలో వడదెబ్బతగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్యాధికారి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు శుక్రవారం మండలంలోని

ఉద్దేహళ్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో  . వైద్యాధికారి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సీజనల్ వ్యాదు లైన డెంగ్యూ ,వైరల్ జ్వరాలకు,తట్టు, మరియు అతిసార (వడదెబ్బ) ,వ్యాధులపై అవగాహన కల్పించటం జరిగింది.ఉదయం 11గంటల లోపల పనులు ముగించాలని, ఎండలో  తిరగరాదని ,మజ్జిగ ,నీరు, ఓ అర్ స్ ద్రా వనాలు త్రాగాలనీ,కాటన్ దుస్తులు ధరించాలని,గృహ దర్శనాలు చేస్తూ  రక్త పరీక్షలు చేస్తూ ఆరోగ్య సూచనలు చేయడం జరిగింది. అలాగే వైయస్సార్ ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు బీపీ షుగర్ పరీక్షలు చేశాను సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త గోవర్ధన్ ఎం ఎల్ హెచ్ పి నాగమణి ప్రధానోపాధ్యాయుడు శరణప్ప వీణ కుమారి ఆశా వర్కర్లు ఈరమ్మ లక్ష్మి హరిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img