Friday, April 26, 2024
Friday, April 26, 2024

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి

జిల్లా గ్రంథాలయ చైర్‌ పర్సన్‌ ఉమామోహన్‌ రెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ :
గ్రంథాలయాలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ ఉమా మోహన్‌ రెడ్డి అన్నారు 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆమె ఉరవకొండలో నిర్వహించిన మహిళా దినోత్సవం మరియు విద్యార్థులకు బహుమతులు ప్రధానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పిల్లలు సెల్‌ ఫోన్లు, ఫేసుబుక్‌, వాట్సాఅప్‌, విడియో గేమ్స్‌ తో సమయాన్ని వృధా చేస్తున్నారని. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గ్రంధాలయాలకు పంపించాలన్నారు అక్కడ లభించే పలు రకాల పుస్తకాలపై అవగాహన కల్పించి పుస్తకపట్నంపై శ్రద్ధతీసుకొనేలా కృషి చేయాలన్నారు. పుస్తకాలకు మించిన స్నేహితులు లెడని ప్రతివిద్యార్థి గ్రంధాలనికి వచ్చి విజ్ఞానాన్ని పెంపోందించుకోవలని ఆమె తెలిపారు. చాలా రకాల పుస్తకములు గ్రంధాలయంలో అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రతిఒక్కరు ఉపయోగించుకోవాలని కొరినారు. 55వ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలో ప్రతిభ కనపరిచిన వారికి చైర్‌ పర్సన్‌ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎల్‌. ఎం మోహన్‌ రెడ్డి, స్థానిక గ్రంథాలయ అధికారి ప్రతాప్‌ రెడ్డి, ప్రభుత్వ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, పద్మజ, పీఈటి కిరణ్‌ వీరితోపాటు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img