Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఘనంగా జరిగిన మానవ హక్కుల దినోత్సవం

కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ రెడ్డి
విశాలాంధ్ర` ధర్మవరం : పట్టణంలోని కేహెచ్‌ ప్రభుత్వా డిగ్రీ కళాశాలలో శనివారం మానవ హక్కుల దినోత్సవం ను రాజనీతి శాస్త్రం విభాగ అధిపతి డాక్టర్‌ బి.గోపాల్‌ నాయక్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు నడుమ ఘనంగా నిర్వహించు కోవడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌ తో పాటు వైస్‌ ప్రిన్సిపాల్‌ జీవన్‌ కుమార్‌ లు మాట్లాడుతూ ఈ రోజును ప్రపంచంలోని అన్ని దేశాలు మానవ హక్కుల దినోత్సవం గా జరుపుకుంటున్నాయని, రాజ్యాంగంలోని పౌరులకు కల్పించిన హక్కులను అవగాహన చేసుకుని, వృద్ధి చెందాలని తెలిపారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, కార్మికులు, వెనుకబడిన వర్గాలతో పాటు ఇతర వర్గాలు తమ హక్కుల ఉల్లంఘనను గుర్తించి, హక్కులను కాపాడుకుంటూ దేశాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. సమాజంలో మానవ హక్కుల ఉల్లంఘన పట్ల విద్యార్థులు జాగ్రత్త వహించి, తమ హక్కులను కాపాడుతూ, తోటి వారి హక్కులకు భంగం కలిగించకుండా, మంచి పౌరులుగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గోపాల్‌ నాయక్‌ ,చిట్టెమ్మ, షమీవు ల్లా ,పావని, కిరణ్‌ కుమార్‌, భువనేశ్వరి, పుష్పావతి, రామ్మోహన్‌ రెడ్డి, గౌతమి, ఆనందు, కే. స్వామి తదితర అధ్యాపక బోధనేతర బృందం వారు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img