Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు…

విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని ఈద్గా మైదానంలో పట్టణ ముస్లిం సోదరులు శనివారం ఘనంగా రంజాన్ పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది ముస్లిం సోదరులు ఉదయాన్నే ఈద్గా మైదానికి చేరుకున్నారు. అనంతరం కేతిరెడ్డి కాలనీ లో గల ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్ ముబారక్ అంటూ చిన్నారుల సైతం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం మత పెద్దలు కురాన్ పటనం చేశారు. ఈ రంజాన్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. తదుపరి ముస్లిం సోదరుల నడుమ ఎమ్మెల్యే ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా వల్ల రంజాన్ వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని పరిస్థితి వచ్చిందని, నేడు భగవంతుని దయవల్ల ఈ సంవత్సరం ఘనంగా రంజాన్ను ముస్లిం సోదరులు, పిల్లలు, కుటుంబ సభ్యులు జరుపుకోవడం ఎంతగానో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. అనంతరం ఈద్గా మైదానంలో చిన్నారులతో సైతం పెద్దలు కూడా ఒకరినొకరు ఆలింగడం చేసుకొని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. వన్ టౌన్ టూ టౌన్ పోలీసులు భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను నిర్వహించారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్:: నియోజకవర్గంలోని ముస్లిం సోదరీ సోదరీమణులకు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు వారి వారి మసీదుల వద్ద, వారికి అనుకూలమైన ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ జూనియర్ నాయకులు కార్యకర్తలు కూడా ముస్లిం సోదరులు కు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్ వేడుకల్లో వేలాదిమంది ముస్లిం సోదర సోదరీమణులు పవిత్రమైన రంజాన్ ను అత్యంత వైభవముగా నిర్వహించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img