Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం ఇవ్వాలి : సీడీపీఓ వనజాక్షి

విశాలాంధ్ర-రాప్తాడు : అంగన్వాడీల్లోని చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం ఇవ్వాలని ఐసీడీఎస్ ఏసీడీపీఓ వనజాక్షి సూచించారు. మండలంలోని చిన్మయ నగర్ లోని రెండు అంగన్వాడి కేంద్రాలను రాప్తాడు ఐసీడీఎస్ సూపర్వైజర్ ఝాన్సీరాణితో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా అంగన్వాడి కేంద్రంలోనీ రికార్డులను పరిశీలించి ప్రభుత్వం పంపిణీ చేసిన పౌష్టికాహారాన్ని తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, చిన్నారులకు ఆంగ్ల బోధన చేయాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, ఐదేళ్ల చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించొచ్చని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమయ పాలన పాటించి కేంద్రాలను సక్రమంగా చూసుకోవాలనీ, అలాగే రికార్డులను సక్రమంగా రాయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎల్లమ్మ, మాధవి అంగన్వాడి సహాయకురాలు విజయలక్ష్మి, సులోచన తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img