Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చేనేత పరిశ్రమను కాపాడుకుందాం..

ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి
విశాలాంధ్ర-ధర్మవరం : చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించుటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, చేనేత రిజర్వేషన్ చట్టమును అమలు చేసి చేనేత కార్మికుల ఉపాధిని పరిరక్షించాల్సిన అధికారులు పాలకులు నిమ్మకు నేనెత్తినట్లు ఉండడం దారుణమని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని కళా జ్యోతి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం ముందు ఈనెల 25వ తేదీన పట్టణంలోని జి ఆర్ బి ఫంక్షన్ హాల్ లో చేనేత కార్మికులను కాపాడుకునే అంశాలపై గల కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం జింకా చలపతి మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన చేనేత కార్మికుల విస్కృత సమావేశంలో చేనేత కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవాలని వారు తెలిపారు. నేడు చేనేత పరిశ్రమ సంక్షోభం ఫలితంగా ఉపాధి కోల్పోయి, రోడ్డున పడే పరిస్థితి నుండి బయటపడాలి అంటే చేనేత కార్మికులు అందరూ కూడా ఉద్యమానికి సిద్ధమై, తాడో,పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని వారు తెలిపారు. సంపన్నుల వలలో పడి చేనేత కార్మికులను నట్టేట ముంచుతున్న పాలకవర్గం తో పాటు దానికి వంత పాడుతున్న వారిని కళ్ళు తెరిపించుకుంటే, ఇక ఇక్కడ చేనేత కార్మికుల మనుగడ అసాధ్యమని వారు తెలిపారు. డిమాండు ఎక్కువ, తక్కువ ఉత్పత్తి కావడంతో ఈ అవాంతరం ఏర్పడిందని వారు తెలిపారు. చేద్దామంటే నేడు చేనేత కార్మికులకు పని లేదు-చేసిన పనికి కూలి లేదు-నేద్దామంటే మగ్గం లేదు-నేసిన చీరకు గిట్టుబాటు ధర లేదు-మాకు దారేంటి? మా భవిష్యత్తు ఏంటి? మా ఉపాధి మాటేంటి? అన్న ప్రశ్నలకు నేతన్నల సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని వారు తెలిపారు. నేడు చేనేత కార్మికుల బ్రతుకు బండి కొంతమంది దగాకోరుల మూలాన.. మా ఉపాధి ప్రమాదంలో పడిందన్న భావం.. స్పష్టంగా కనబడుతోందని తెలిపారు. చేనేత రిజర్వేషన్ చట్టమును అమలుచేసి, చేనేత కార్మికుల ఉపాధిని పరిరక్షించాల్సిన అధికారులు, పాలకులు కూడా చేనేతను చెరపెట్టిన పవర్లూమ్స్ యాజమాన్యంతో లాలూచీపడి చేనేత కార్మికులకు మోసం చేయడం దారుణమని తెలిపారు. వేలాదిమందికి జీవనాధారమైన చేనేత పరిశ్రమను చంపవద్దని, అది ఉపాధి సంక్షోభానికి దారితీస్తుందని ఆనాడు నెత్తి ,నోరు బాది మొత్తుకున్న, వినకుండా, చేనేత కార్మికుల ను కష్టాల సుడిగుండంలోకి నెత్తిన వైన్యాన్ని నేడు చూడటం జరుగుతుందన్నారు. కావున చేనేత కార్మికులందరూ ఇప్పటికైనా చేనేత వృత్తిని భవిష్యత్తులోనూ కాపాడుకోవాలంటే, ఈనెల 25వ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సంత మార్కెట్ రోడ్డు- దుర్గమ్మ గుడి వద్ద గల జిఆర్బి ఫంక్షన్ హాల్లో నేతన్నల సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై, భవిష్యత్ కార్యక్రమానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ లతోపాటు రమణ, ఆదినారాయణ, శ్రీధర్, శ్రీనివాసులు, బాల రంగయ్య, రామాంజనేయులు, మంజునాథ్, వీరనారప్ప, నాగరాజు, అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img