Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

విశాలాంధ్ర – ఉరవకొండ : జాతీయ డెంగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీహెచ్సీ డాక్టర్ పివి అనికేత్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి వైరస్ ద్వారా సంభవిస్తుందని, ఈ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెంది డెంగ్యూ జ్వరాన్ని కలుగ చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ యు వెంకటరమణ గ్రామ ప్రజలకు దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. డెంగ్యూ జ్వరం వైరస్ ద్వారా సంభవించే ప్రమాదకరమైన జబ్బని అయితే ఈ వ్యాధి నియంత్రణ మన చేతుల్లో ఉందని, ముఖ్యంగా డెంగ్యూ జ్వరం టైగర్ దోమ లేదా ఏడీస్ ఈజిప్ట్ అనే దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని కాబట్టి గ్రామ ప్రజలందరూ వారంలో ప్రతి శుక్రవారం డ్రైడేగ పాటించాలని ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఉన్నటువంటి నీరు నిల్వ ఉన్నటువంటి పాత్రలను, తొట్టెలను, పాత టైర్లను, వేస్ట్ ప్లాస్టిక్ గ్లాసుల్లో నీరు నిల్వ లేకుండా చేయడం దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు. నీటి నిల్వల్లో టైగర్ దోమ పెరిగి దాదాపు 400 గుడ్లను పెట్టి తద్వారా గుడ్ల నుండి డింబకం, ప్యూప మరియు అడల్ట్ గా మార్పు చెంది తన జనాభాను పెంచుకుంటూ ప్రజలకు డెంగ్యూ జ్వరాన్ని మరియు ఇతర వ్యాధులను వ్యాప్తి చెందింపచేస్తుందని కాబట్టి గ్రామ ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ దోమ కాటు నుండి బయటపడి తద్వారా డెంగ్యూ జ్వరం రాకుండా చూసుకోవచ్చని అవగాహన కల్పించారు. సాయంత్రం పూట వేపాకు పొగ వేసుకోవడం, దోమతెరలను వాడడం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ లక్ష్మీ నరసమ్మ ,సూపర్వైజర్లు చౌడప్ప,నాగరత్నమ్మ ఆరోగ్య సహాయకులు ప్రసాదరావు, ఎం నాగరాజు ఏఎన్ఎం, బి నీలావతి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img