Friday, April 26, 2024
Friday, April 26, 2024

జిప్సం లేదు ….జింకు రాదు

సూక్ష్మ పోషకాల పంపిణీపై నిర్లక్ష్యం
మూడేళ్లుగా ఇదే పరిస్థితి
విశాలాంధ్ర`బొమ్మనహల్‌ :
అన్నదాతకు సూక్ష్మ పోషకాలు ఎరువులు కొనుగోలు భారంగా మారుతుంది. గత ప్రభుత్వం నూరు శాతం రాయితీతో అందజేయగా మూడేళ్లుగా ఈ పథకం మరుగునపడిరది మూడేళ్లుగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపగా ధరల ప్రభావం అన్నదాతకు భారమవుతుంది పెదిగిన సాగు ఖర్చులు రాయితీ ఎరువులు లేకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి. అధికారులు మాత్రం అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని చెబుతున్నారు. ఇలా ఖరీఫ్‌, రబీ సీజన్లో కాలం వెళ్లదీసారే తప్ప ఎక్కడ కిలో సూక్ష్మ పోషకాలు ఇవ్వలేదు. బయట మార్కెట్లో వీటి ధరలు ఎక్కువగా ఉండడంతో అన్నదాత అదనపు పెట్టుబడి పెట్టక తప్పలేదు. జిల్లాలో ఏటా వేలాది ఎకరాల్లో వరి వేరుశనగ ఉద్యాన పంటలు తదితర పంటలు సాగు అవుతాయి. భూముల్లో జింకు ఇనుప దాతు లోపం లవణ భూములు ఉన్నాయి. పోషక లోపాలు ఉన్న భూములు ఆయా లోపాలు సవరించడానికి సూక్ష్మ పోషకాలు వేయడం పంటలపై పిచికారి చేయాల్సి ఉంది. ఇలా భూసారాన్ని మెరుగుపరచడం దిగుబడులు పెంచడం ఎరువులు వాడకం తగ్గించడం పోషక యజమాన్యం ఉద్దేశం.
అన్నదాతకు నిరాశ….
జింక్‌ జిప్సం బోరాన్‌ తదితర ద్వితీయ శ్రేణి పోషకాలను భూసార పరీక్షల ఆధారంగా 100% రాయితీతో గతంలో ప్రభుత్వం అందజేసేది అర్హులైన రైతులకు ఆధార అనుసంధానంతో డి కృషి యాప్‌ ద్వారా అందిస్తుండగా మూడేళ్లుగా దాని జాడే లేదు. జింకు వరి పంటకు ఎకరాకు 20 కిలోలు జిప్సం వేరుశనగకు 200 కిలోలు ఉద్యాన పంటలకు జింకు జిప్సం బోరాన్‌ ఎరువులు వినియోగిస్తారు. నేలలో లోపాలు సవరించడానికి ప్రభుత్వం రాయితీతో సూక్ష్మ పోషకాలు అందజేసేది ఏటా వీటి కోసం కోట్లకు పైబడి ఖర్చు చేసేవారు. ఎంపిక చేసిన రైతులకు వీటిని ఉచితంగా అందజేయగా మూడేళ్లుగా రాయితీలు లేకపోవడంతో వ్యవసాయ శాఖ అందజేయడమే మానేసింది. జింకు జిప్సం బోరాన్‌ ఎరువులు బహిరంగ మార్కెట్లో ను లభించడం లేదు సూక్ష్మ పోషకాల లోపంతో దిగుబడులపై 15 20% ప్రభావం చూపుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. తక్కువ ఖర్చుతో అధిక ప్రభావం చూపుతుందని ఉద్దేశంతో వరి వేరుశనగ ఉద్యాన పంటలకు వేయాలన్న లభించడం లేదని రైతులు వాపోతున్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img