Friday, April 26, 2024
Friday, April 26, 2024

జీవో నంబర్ 1 రద్దు చేయాలని వినూత్న రీతిలో అఖిలపక్షం పార్టీ నాయకులు నిరసన…

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్ర ప్రభుత్వం సభలను,ర్యాలీలను నిషేధిస్తూ జారీచేసిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ,సీపీఎం, టిడిపి, జనసేన, బీఎస్పీ పార్టీల నాయకులు వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం గణతంత్ర దినోత్సవం రోజున సిపిఐ పార్టీ పిలుపు మేరకు గుంతకల్లు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిలపక్ష నేతలు వినూత్న రీతిలో కళ్లకు నల్ల రిబ్బన్లని కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులు సిపిఐ గుంతకల్లు నియోజకవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్,సిపిఎం పట్టణ కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసులు,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, టిడిపి యువ నాయకులు అనిల్ గౌడ్, బీఎస్పీ గుంతకల్లు ఇంచార్జ్ శ్రీనివాసరాజు ,జనసేన పార్టీ నాయకులు వీరేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వీరభద్రస్వామి,అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ. జీవో నెంబర్ 1నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో కేవలం ప్రతిపక్షాలు చేపడుతున్న ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు కక్ష సాధింపు చర్యలుగా భావించి రద్దు చేయాలన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రతిపక్షాలు పోరాటాలు చేసి నిలవడానికి వెనుకాడమన్నారు. ప్రజలకు అండగా ఉన్న ప్రతిపక్షలపై కక్ష సాధింపు కోసం ప్రభుత్వం ఇలాంటి జీవోలను తీసుకొస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు దీన్నీ ప్రధాన అంశంగా తీసుకుని జీవో ఒకటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎండి గౌస్,ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసి కుల్లాయప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర, ఏఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్,సిపిఐ నాయకులు మల్లయ్య, మురళీకృష్ణ,పుల్లయ్య,ప్రసాద్, రామాంజనమ్మ,వంశిక్రిష్ణ,నందు,ఏఐఎస్ ఎఫ్ నాయకులు వెంకట్ నాయక్ ,వినోద్ కుమార్,చంద్ర, సిపిఎం పార్టి నాయకులు కసాపురం రమేష్, సాకే నాగరాజు, మారుతి ప్రసాద్, తిమ్మప్ప,జగ్గిలి రమేష్ ,సంచార జాతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అడ్వెకెట్ శ్రీనివాసులు,టిడిపి నాయకులు, బి.ఎస్.పి పార్టీ నాయకులు ఆలం నవాజ్, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img