Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఢిల్లీలో ప్రధాన భూమిక సదస్సుకు హాజరు కావడం నాకెంతో సంతోషంగా ఉంది…

మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున
విశాలాంధ్ర -ధర్మవరం : దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఈనెల 6, 7 వ తేదీలలో రెండు రోజులు పాటు దేశ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన భూమిక సదస్సుకు అనగా ఆరవ ఏషియన్ సిటీస్ సబ్మిట్-2023కు నన్ను ఆహ్వానించినందుకు తనకెంతో సంతోషంగా ఉందని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఢిల్లీ నుంచి పలు సమాచారాలను సెల్ఫోన్ ద్వారా వారు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రధాన భూమిక సదస్సుకు వందకు పైగా మేయర్లు, కమిషనర్లు, సీనియర్ సిటీ తో పాటు ప్రభుత్వ ప్రతినిధులు,అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధులు, ప్రపంచంలో 50 కంటే ఎక్కువ దక్షిణాసియా నగరాల రూపకర్తలు, 50 కి పైగా అంతర్జాతీయ జాతీయ స్పీకర్లు ప్రత్యేక నిపుణులు, 30కి పైగా జాతీయ అంతర్జాతీయ సంస్థలు, 20 కి పైగా దేశాల నుండి వివిధ విధాన రూపకర్తలు, 300కు పైగా కమ్యూనిటీ సంస్థల ప్రతినిధులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ తరఫున తనకొక్కరికే రావడం వల్ల, ఈ సదస్సులో ఇచ్చే ప్రతి సూచనలు ,సలహాలను పట్టణ అభివృద్ధి కొరకు అమలు చేసి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులో పలువురు అనుభవాలతో కూడిన విషయాలను చర్చించిన అంశాలను పూర్తిగా అవగాహన చేసుకుని మునిసిపాలిటీని మరింత అభివృద్ధి దిశగా తీసుకొని వెళతారని వారు తెలిపారు.ఈ సదస్సుకు వారికి ఆహ్వానం రావడం పట్ల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తో పాటు మున్సిపల్ విభాగంలోని పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img