Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నరేంద్ర మోడీని గద్దె దింపండి–దేశాన్ని కాపాడండి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఈనెల 14 నుండి 30వ తేదీ వరకు సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార జాత కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో పంచాయిత్ ఆఫీస్ దగ్గర శుక్రవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సిపిఐ మండల కార్యదర్శి సనప నీళ్లపాళ్ల రామకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ ,జయంతి పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అన్ని మతాలకు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. ఘనంగా జయంతి .ఈ కార్యక్రమంలో సిపిఐ ఆత్మకూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం రాప్తాడు నియోజకవర్గం ఉపాధ్యక్షుడు బి రామాంజనేయులు సిపిఐ శాఖ కార్యదర్శి ముత్యాలప్ప, దిలీఫ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img