Friday, April 26, 2024
Friday, April 26, 2024

పొగాకు నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాష్ర్ట మరియు జిల్లావైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు డాఁ జి. నారాయణస్వామి పొగాకు నియంత్రణ, అసంక్రమిత వ్యాధుల పై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతీయ పొగాకు నియంత్రణ చట్టం సి ఒ టి పి ఏ -2003 అమలులో ముఖంగా బహిరంగ ప్రదేశాల్లో, నిషేధిత ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల ఆవరణంలో ధూమపానం చేయడం పొగాకు ఉత్పత్తుల అమ్మకం వంటి వాటికి జరిమానా విదించడమైనది. పొగాకు వాటి ఉత్పత్తులను సేవించడం వలన కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ ఈ చటాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలియజేసారు. మండల మరియు పట్టణ స్థాయి ఎన్ఫోరసెమెంట్ టీమ్ ద్వార నెలకు రెండు పర్యాయములు డ్రైవ్ ద్వారా అవగాహన కల్పించి ,అతిక్రమించిన వారికి సి ఒ టి పి ఏ -2003 యాక్ట్ అమలు చేస్తామని తెలియజేసారు.
అనంతరం పట్టణంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మునిసిపల్ గెస్ట్ హౌజ్ ముందు అనధికార పొగాకు విక్రయ దారులకు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ద్వారా అవగాహన కల్పించి మరియు చలానా రూపంలో మొత్తం రూ.800 జరిమానా విధించడం జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త బి. శ్రీరాములు, యన్. సి .డి ఫ్లోరోసిస్ కన్సల్టెంట్స్ ఆంజనేయులు, కిషోర్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img