Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు

ప్రతి సచివాలయంకు రూ.20 లక్షలు నిధులు మంజూరు
నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం
విశాలాంధ్ర`అనంతపురం(వైద్యం) :
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో స్థానికులు తీసుకొచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నట్లు నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం పేర్కొన్నారు. నగరంలోని 38వ డివిజన్‌ పరిధిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో స్థానికులు తీసుకొచ్చిన సమస్యల పరిష్కారం కోసం సచివాలయంకు విడుదలైన రూ.20 లక్షలు వ్యయంతో చేపడుతున్న పనులకు గురువారం భూమి పూజ పనులను మేయర్‌ మహమ్మద్‌ వసీం డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయ భాస్కర్‌ రెడ్డి లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ వసీం మాట్లాడుతూ గతంలో మనం ఎన్నో ప్రభుత్వాలను చేశామన్నారు. అయితే తొలిసారిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మూడేళ్ల పాలనలోని 98 శాతం పైగా అమలు చేసిన ఘనతను చూస్తున్నాం అన్నారు. ప్రతి ఇంటికి అర్వత ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా సంక్షేమ పథకాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు ఆయా ఫలాలు అందుతున్న తీరును పరిశీలించేందుకై గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.నగరంలో అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలతో మమేకమై గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంను నిర్వహించడంతో పాటు స్థానికులు తీసుకొచ్చిన సమస్యలను సచివాలయంకు విడుదలైన రూ.20 లక్షలు వ్యయంతో అత్యవసర పనులకు తక్షణ పరిష్కారం చూపుతున్నారన్నారు.ప్రధానంగా రోడ్లు,డ్రైనేజీలు, త్రాగునీటి పనులు వంటి ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సూచనలతో పనులను చేపడుతున్నట్లు మేయర్‌ పేర్కొన్నారు.మిగిలిన సమస్యలను కూడా ఇతర గ్రాంట్‌ ల నుండి నిధులు మంజూరు చేసి పూర్తి చేయిస్తామని ప్రజలు తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మేయర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ నాగ మోహన్‌ ,వైసీపీ నాయకులు ఖాజా,చింతకుంట మధు,చిన్ని,రమేష్‌,నాగరాజు,ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img