Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రత్యేక వాహనాలలో దర్శనమిచ్చిన చెన్నకేశవ స్వామి-ఆలయచైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం వారి బ్రహ్మోత్సవ వేడుకలు ఈనెల 27వ తేదీ నుండి మే నెల 7వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ వైస్ చైర్మన్ కుండా చౌడయ్య,ఆలయ డైరెక్టర్లు, దాతలు, భక్తాదుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా శనివారం స్వామివారు ఉదయం సర్వ భూపాల వాహనంలో సాయంత్రం సింహ వాహనంలో పట్టణ పురవీధులలో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్, గుణ స్వామి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయ దాతలైన రంగన్న అచ్చప్ప అండ్ సన్స్, జూజారు సత్యప్రభ,సురేష్, రాధా, నీలూరి శ్రీనివాసులు, కుంబర్తి శ్రీధర్, మనిషా, జనదీప్, పుట్లూరు కుళ్లాయప్ప అండ్ సన్స్, అడ్డగిరి గోపాల్, కీర్తిశేషులు చుక్కలూరు సోలిగాళ్ళ నాగమ్మ, ఆంజనేయులు అండ్ సన్స్, కీర్తిశేషులు కమ్మ శేషన్న జ్ఞాపకార్థం వారి కుమారులుపేరిటన వారి కుమారులు పేరిటన అర్చనతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘనంగా స్వామివారి ఎదుట ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సత్కరించారు. స్వామివారి అలంకరణ భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. తదుపరి ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవ వేడుకలు మే 7వతేదీ తో ముగుస్తాయన్నారు. ఈ వేడుకలు కమిటీ, దాతల సహాయ సహకారములతో నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు జగ్గా జయలక్ష్మి, పోరాల్ల పద్మావతి, సత్రశాల సత్యనారాయణ, సౌందర్య లహరి సునీత, గిర్రాజు మహాలక్ష్మి, అన్నమయ్య సేవా మండలి పోరాల్ల పుల్లయ్య, వారి శిష్య బృందం, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img