Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ అవగాహన

విశాలాంధ్ర -ఉరవకొండ : అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఆ శాఖ వారోత్సవాల్లో భాగంగా శనివారం ఉరవకొండ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఏ.భీ మలింగయ్య ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా వివిధ ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్, ఆయిల్, గ్యాస్, వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలో ఆర్టీసీ సిబ్బందికి మరియు అక్కడున్న ప్రయాణికులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తమ శాఖ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ దయాల్ ఆర్టీసీ సిబ్బంది, ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img