Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భగత్ సింగ్  ఆశయ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి

ఏఐఎస్ఎఫ్ నియోజవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్

విశాలాంధ్ర-గుంతకల్లు : దేశ స్వాతంత్ర్యం కోసం అతిచిన్న వయస్సులో ప్రాణాలర్పించిన వీర కిషోరాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ స్ఫూర్తితో విద్యార్థి, యువత ముందుకెళ్లాలని ఏఐఎస్ ఎఫ్ నియోజవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్ అన్నారు. పట్టణంలోని సీపీఐ కార్యలయంలో ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో గురువారం భగత్ సింగ్ 92 వ వర్దంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి సీపీఐ మండల కార్యదర్శి రాము రాయల్ , సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎండి గౌస్ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మురళీకృష్ణలు పూలమాలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని వెంకట్ నాయక్ అధ్యక్షతన వహించారు.ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు  డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు సేవించడంతో ఆనారోగ్యం బారిన పడుతున్నారని, చెడు వ్యసనాలకు బానిసలవుతారని అన్నారు. డ్రగ్స్, గంజాయిని నిర్మూలించాడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, విద్యార్థులు, యువత చైతన్యవంతం కావాలని అన్నారు.భగత్ సింగ్  ఆలోచనలతో, ఆశయాల స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని అన్నారు.దేశ స్వాతంత్రోద్యమ వీరుల చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని, నేడు సమాజంలో సామ్రాజ్యవాద దోపిడి మరో కోణంలో జరుగుతుందని, విద్యా, వైద్యం వంటి అంశాలు పేదలకు అందని ద్రాక్షలా మారుతున్నాయని, మతోన్మాదం పెచ్చరిల్లుతూ భారత చారిత్రక లౌకిక వారసత్వాన్ని దెబ్బతీస్తున్నదని అన్నారు‌. అంటరాని తనం, అసమానతలు తీవ్రమవుతున్నాయని, మహిళలు, చిన్నారుల పై దాడులు,హత్యాచారాలు పెరుగుతున్నాయని ఈ తరుణంలో వీటన్నింటిపై ఉద్యమించడమే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు మనమిచ్చే ఘననివాలని అన్నారు.

రాము రాయల్ మాట్లాడుతూ…కేంద్రంలో బిజెపి ప్రభుత్వం భగత్ సింగ్  జీవిత చరిత్రను పాఠ్యాంశాల నుండి తొలగించడం సిగ్గుచేటన్నారు.డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలను నిర్మూలించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, నిరంతర నిఘా పెట్టి డ్రగ్స్, గంజాయి బారి నుండి యువత ప్రాణాలను కాపాడాలని అన్నారు.

ఎస్ ఎం డి గౌస్ మాట్లాడుతూ..  డ్రగ్స్, గంజాయికి బానిసై విద్యార్థి, యువత చెడు వ్యసనాలబారిన పడుతున్నారని, మారుమూల  గ్రామాల నుండి పట్టణ ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి దొరుకుతుందని దీంతో కుటుంబాలు ధ్వంసమవుతున్నాయని అన్నారు‌. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలను కట్టడి చేయాడానికి ప్రభుత్వం, అధికారిక యంత్రాంగం, పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా, డ్రగ్స్ నిర్మూలనకై , అవినీతి అంతంకై, రాజ్యాంగ పరిరక్షణకై విద్యార్థి,యువత ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చంద్రశేఖర్, పట్టణ సహాయ కార్యదర్శి అఖిల్ ,రాజ్ కుమార్, శ్యామ్, శ్రావణ్ ,అశోక్ ,షేక్షావలి ,రాము ,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img