Friday, April 26, 2024
Friday, April 26, 2024

మరపురాని మహా నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ

విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : మరపురాని మహా నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ అని పలువురు నేతలు కొనియాడారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సూపర్‌ స్టార్‌ కృష్ణ సంస్మరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అనంత చంద్రారెడ్డి గారు కృష్ణ గారి చిత్రపఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అనంత చంద్రారెడ్డి. ఆలమూరు శ్రీనివాసరెడ్డి. గౌస్‌ బేగ్‌. నరసింహ్ములు. మారుతినాయుడు లు మాట్లాడుతూ నటుడు గా రాజకీయ నేతగా,మానవతా వాదిగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.సుమారు 350 పైగా సినిమాలలో నటించి, వినూత్న సాంకేతిక పద్దతులను ప్రవేశపెట్టి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ అకాల మరణం తీరని లోటు అన్నారు.ఈ కార్యక్రమంలో. కృష్ణ%డ%మహేశ్‌ బాబు అభిమానులు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు. పెన్నోబిలేసు, గోపాల్‌ మోహన్‌. కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్‌, నరసింహ్ములు. మాలపాటిశ్రీనివాసులు,రహంతుల్లా. ఇషాక్‌.నాయకులు చింతకుంట మధు. రాధాకృష్ణ. వడ్డె రామచంద్రా. అరవిందరెడ్డి,యం.డి.హస్సేన్‌.దేవాంగం రామయ్య,జిలాన్‌, . అంజాద్‌ ఖాన్‌. సురేష్‌ రెడ్డి. తలారి నవీన్‌, కుమార్‌, మల్లెల వేణుగోపాల్‌.కుమ్మరి ఓబులేసు. జావీద్‌.బాలనాగి రెడ్డి. నడిమీవంకనాగరాజు.కురుభ చంద్రా,.నారాయణ రెడ్డి. రఫి. ఖాదర్‌ బలరాం, వెన్నపూస రామచంద్రారెడ్డి,నందా,ఏ1 రఫి, కృష్‌, రామాంజనేయులు, వెంకటేష్‌, సురేష్‌, యోగానందరెడ్డి,గోగుల పుల్లయ్య, రామకృష్ణ. హనుమంతు, కాలేష్‌, వై.వి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img