Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మున్సిపాలిటీలో రెండు సం,,లు గడిచిన సమన్వయ కమిటీ ఏర్పాటు లేదు…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో పరిపాలించే పరిపాలన యంత్రాంగం ప్రజల చేత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్గా పట్టణ కౌన్సిలర్లు ఎన్నుకోబడి ఉంటారు. అయితే ప్రజల చేత ఎన్నుకోబడి రెండు సంవత్సరాలు గడిచినా ఇంతవరకు గుంతకల్లు పురపాలక సంఘం కార్యలయంలో సమన్యాయ కమిటీ ఏర్పాటు చేయలేదు. అయితే దీనివల్ల పరిపాలన యంత్రాంగం చేయవలసిన అబివృద్ది పనులు పట్టణ ప్రణాళిక భూ వినియోగం,భవనాల నిర్మాణ నియంత్రణ,ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రణాళిక,దేశీయ, పారిశ్రామిక, వాణిజ్య ప్రయోజనాల కోసం నీటి సరఫరా,ప్రజారోగ్యం, పారిశుద్ధ్య సంరక్షణ, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ,అగ్నిమాపక సేవలు,పట్టణ అటవీ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ అంశాలను ప్రోత్సహించడం,వికలాంగులు, మానసిక వికలాంగులతో సహా సమాజంలోని బలహీన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం,మురికివాడల మెరుగుదల, నవీకరణ,పట్టణ పేదరిక నిర్మూలన,పట్టణ సౌకర్యాలు, పార్కులు, తోటలు, ఆట స్థలాలు వంటి సౌకర్యాలు కల్పించడం,సాంస్కృతిక, విద్యా, సౌందర్య అంశాల ప్రచారం,ఖననం, శ్మశాన వాటికలు, దహన సంస్కారాలు, దహన మైదానాలు, విద్యుత్ దహన సంస్కారాలు,పశువుల, జంతువులపై క్రూరత్వాన్ని నివారించడం,జననాలు, మరణాల నమోదుతో సహా కీలక గణాంకాలు,వీధి దీపాలు, పార్కింగ్ స్థలాలు, బస్ స్టాపు లాంటి ప్రజా సౌకర్యాలతో సహా అన్ని ప్రజా సౌకర్యాలు,స్లాటర్ ఇళ్ళు, తోళ్ళ శుద్ధి కర్మాగారాలు యొక్క నియంత్రణ ఇలాంటి వాటికి సక్రమంగా జరగాలంటే సమన్యాయ కమిటీ అవసరం దీన్ని రెండు సంవత్సరాలుగా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు వహించారన్న విషయంపై ప్రజలు గుసగుసలాడుతున్నారు.. ఇప్పటికైనా సమన్యాయ కమిటీ ఏర్పాటు చేసి యంత్రాంగంతో పట్టణ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రజల కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img