Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగడం దురదృష్టకరం..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : ఏపీ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారి స్వగృహంలో విలేకరులతో వారు మాట్లాడుతూ సొంత పార్టీలోనే పరిపాలనపై విమర్శలు కనిపిస్తున్నాయని తెలుపుతూ,ప్రభుత్వంపై మండిపడ్డారు. సలహాదారుల నిర్వాహకం వల్ల ప్రజలు బేజారు చేసుకోవడం జరుగుతుందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన ప్రజలు తోపాటు పార్టీలోని వారే విసుగు చెందడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఏపీను దోపిడీ చేయుట లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్లు ప్రభుత్వాన్ని కాకుండా, పార్టీ పరంగా పని చేయించుకోవడం సరైన పద్ధతి కాదని వారు హెచ్చరించారు. సచివాలయ వాలంటీర్లు కూడా ఆలోచించాలని వారు సలహా ఇచ్చారు. అదేవిధంగా ధర్మవరంలో ఖబర్ స్థాన్ లో రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ముస్లిం సోదరులందరూ కూడా ఐక్యతగా ఉండి మీ సమస్యను మీరే పరిష్కరించుకునేలా చర్యలు చేపట్టాలని వారు సలహా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మూడు సంవత్సరాలలో పేదలకు ఒరిగింది ఏమీ లేదని తెలిపారు. కావున రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలి? అన్న ఆలోచనలో ప్రభుత్వాలు ఉంటే ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారని హితవు పలికారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img