Friday, April 26, 2024
Friday, April 26, 2024

రెడ్ క్రాస్ సంస్థ సేవలు అనన్యమైనవి..

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నజీర్
విశాలాంధ్ర – ధర్మవరం : రెడ్ క్రాస్ సంస్థ సేవలు అనన్యమైనవని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నజీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవలు అందించిన నేపథ్యంలో ఈ రెడ్ క్రాస్ ఆవిర్భవించిందని వారు తెలిపారు. ప్రధమ చికిత్స ఇవ్వడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడటం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతిని ఆపద సమయంలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విపత్కర పరిస్థితులలో సాటి మనిషికి రెడ్ క్రాస్ సంస్థ స్వచ్ఛందంగా చేస్తుందని తెలిపారు. రక్త నిధి సేవల ద్వారా ప్రమాదంలో గాయపడిన వారికి, కాన్పుల సమయంలో అవసరమైన వారికి రక్తము, ఆపరేషన్ సమయంలో రక్తము, తల సేమియా వ్యాధిగ్రస్తులకు, రక్తం సకాలంలో దేశవ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. పౌరులు అందరూ కూడా సిపిఆర్ పద్ధతి పై అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img