Friday, April 26, 2024
Friday, April 26, 2024

5 ల‌క్ష‌ల మందిలో ఒక‌రికి వ‌చ్చే రీన‌ల్ హైడాటిడ్ సిస్ట్

అనంత‌పురం కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రిలో విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స‌

అత్యంత సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో ఉచితంగా చేసిన వైద్యులు

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ఇంట్లో కుక్క‌ల‌ను పెంచుకునేవారు, లేదా బ‌య‌ట అయినా వాటితో స‌న్నిహితంగా మెలిగేవారు త‌మ ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే అత్యంత అరుదైన వ్యాధి.. హైడాటిడ్ సిస్ట్. ఇది కాలేయం, ఊపిరితిత్తుల్లో సంభ‌విస్తుంది. అత్యంత అరుదుగా గుండె, వ‌క్ష‌స్థ‌లం, థైరాయిడ్, మెడ‌లోని మృదు క‌ణ‌జాలాలు, మూత్ర‌పిండాల్లోనూ వ‌స్తుంది. కుక్క‌ల మ‌లం మీద వాలిన ప‌రాన్న‌జీవులు ఆ త‌ర్వాత కూర‌గాయ‌లు, పండ్లు లేదా ఇత‌ర ఆహార‌ప‌దార్థాల మీద చేర‌డం, వాటిని మ‌నుషులు తిన‌డం వ‌ల్ల ఇది వ‌స్తుంది. మూత్ర‌పిండాల్లో హైడాటిడ్ సిస్ట్ అనేది అత్యంత అరుదుగా.. అంటే ప్ర‌తి 5 ల‌క్ష‌ల మందిలో ఒక్క‌రికి మాత్ర‌మే వ‌స్తుంది. ఇది వ‌చ్చిన కొన్ని సంవ‌త్స‌రాల పాటు ఎలాంటి ల‌క్ష‌ణాలు కూడా ఉండ‌వు. ఇలాంటి వ్యాధి వ‌చ్చిన ఒక వ్య‌క్తికి అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రిలో విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స చేశారు. ఈ శ‌స్త్రచికిత్స‌లో ఇంకా క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ న‌రేంద్ర‌నాథ్‌, చీఫ్ ఎన‌స్థ‌టిస్ట్ డాక్ట‌ర్ ర‌విశంక‌ర్‌, ఎన‌స్థ‌టిస్ట్ డాక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img