Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైతులకు భరోసా ఇచ్చేది ఎవరు?


భరోసా అంటే సబ్సిడీలు తీసేయడమా? బోరు మోటర్లకు మీటర్లు బిగించడమా?
రైతు సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తాం…

ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటమయ్య
విశాలాంధ్ర ..తనకల్లు .. రైతు సమస్యలను పరిష్కరించే వరకు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు సాగిస్తామని రాష్ట్ర ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటమయ్య తెలిపారు మండల పరిధిలోని గుంజువారిపల్లి రెడ్డివారిపల్లి తదితర గ్రామాల్లో మండుస్‌ తుఫాన్‌ కు నష్టపోయిన రైతుల పొలాలను సోమవారం ఆయనతోపాటు సిపిఐ ఏపీ రైతు సంఘం బృందం పర్యటించి పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ రైతులకు భరోసా ఇవ్వడం అంటే బోరు మోటర్లకు మీటర్లు బిగించడమా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రైతులు వేసిన ప్రతి పంట అకాల వర్షాలకు తుఫాను వల్ల పంటలు నష్టపోయి రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారన్నారు బడ్జెట్లో రైతులకు కేటాయించిన నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు మైక్రో ఇరిగేషన్‌ ద్వారా రైతులక0దే సబ్సిడీలు మాయమయ్యా యన్నారు రైతులు పంటలు పండిరచుకునే కొత్త విధానాలపై చైతన్యపరిచి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చే (ఆత్మ) అగ్రికల్చల్‌ టెక్నికల్‌ మేనేజ్మెంట్‌ ఏజెన్సీ నిరుపయోగమైందన్నారు అకాల వర్షాలకు మండుస్‌ తుఫాన్‌ వల్ల టమోటా మొక్కజొన్న వంకాయ వరి తదితర పంటలు పాడయ్యాయని ఆ రైతులకు గుర్తించి టమోటా రైతులకు ఎకరాకు 1,50,000 మొక్కజొన్న రైతులకు 25 వేల రూపాయలు వరి పంటకు 60000 రూపాయలు వంకాయ పంటకు లక్ష రూపాయలు వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి రమణ ప్రభుత్వాన్ని కోరారు పంటలు నష్టపోయి రైతన్నలు వలస బాట పట్టకుండా ఉపాధి కల్పించాలని పెట్టుబడి సహాయం అందించాలని రైతు కూలీలను ఆదుకోవాలని ఈ ప్రాంతంలో రైతులతో పాటు వారి కుటుంబాలు జీవనం సాగించేలా రైతు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్‌ రెడ్డప్ప రైతు సంఘం కార్యదర్శి ఇక్బాల్‌ కరీముల్లా రవీంద్ర నాయక్‌ తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img