Friday, April 26, 2024
Friday, April 26, 2024

వంద పడకల ఆసుపత్రిలో రోగులకు బెడ్లు కొరత….

సిటీ స్కాన్ ,అల్ట్రా సౌండ్ పరికరం లేక రోగులకు ఇక్కట్లు….

  • ప్రైవేట్ ఆస్పత్రిలో వేల రూపాయలు రోగులకు ఖర్చు

వంద పడకల ఆసుపత్రిలో బెడ్ల కొరత….

సిపిఐ పార్టీ బృందం ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన…

విశాలాంధ్ర-గుంతకల్లు : వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పరికరాలు, బెడ్లు, వైద్య సిబ్బంది కొరతకు రోగులు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కు ప్రశ్నించారు..సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సిపిఐ పార్టీ బృందం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లు పరికరాలు బెడ్లు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు బాత్రూంలు తదితర మూలాలను పరిశీలించారు.ముఖ్య అతిథులు సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్ ,సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ హరిప్రసాద్ తో ఆస్పత్రిలో ఉన్న అనేక సమస్యలపై సిపిఐ నాయకులు చర్చించారు..ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ…గుంతకల్లు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో మంది రోగులకు నిలయంగా మరిది చుట్టుపక్కల పది మండలాల ప్రజలు నిత్యం చికిత్స కోసం వచ్చి వెళ్తుంటారు.అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులతో వంద పడగల ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో భవన నిర్మాణాలు చేపట్టారు అయితే పాత బిల్డింగ్ అయిన ఆస్పత్రి పైనే నిర్మించడం చాలా దారుణం అన్నారు.ఉన్న బిల్డింగు శిథిలావస్థకి వెళ్ళింది ఇంజనీరు దీన్ని పరిశీలించకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల రాబోయే రోజుల్లో ఆస్పత్రి బిల్డింగ్ శిథిలావస్థకు చేరే పరిస్థితులు ఉన్నాయన్నారు.ప్రస్తుతం బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేశారు. అయితే బ్లడ్ బ్యాంకులో సిబ్బంది కొరత దాపరించింది బ్లడ్ బ్యాంకులో ఇద్దరు మాత్రమే ఉండడం విడ్డూరమ్మన్నారు.అంతేకాకుండా క్యాన్సర్ లేదా ఊపిరితిత్తుల్లో ఏదైనా ప్రారంభ కనితిని మరియు క్షయవ్యాధిని గుర్తించడానికి సిటీ స్కాన్ ఉపయోగపడుతుంది ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ,అల్ట్రా సౌండ్ లేక రోగులు ప్రైవేటు ఆసుపత్రిలో డబ్బులు వేచించాల్సి వచ్చిందన్నారు.

కీలకమైన పరికరాలు సిటీ స్కాన్ ,అల్ట్రా సౌండ్ కు దాదాపు 5000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు.సిటీ స్కాన్ మిషన్లు ప్రభుత్వం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆస్పత్రి సూపర్డెంట్ కు తెలియజేశారు.100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం జాలి దయ లేకుండా ఆసుపత్రి సిబ్బంది బెడ్లు కొరత ఉందని అందుకు ఒక బెడ్ పై ముగ్గురు రోగులకు చికిత్స అందించడం చాలా దుర్మార్గమన్నారు.ఒకరి శ్వాస ఒకరికి తగలడంతో మరింత రోగం తీవ్రత పెరిగి మళ్లీ ప్రమాదం కొరితెచ్చుకున్నట్లు ఉంటుందని తెలిపారు.రోగులను గొర్రెల మందులుగా ఒక్క రూమ్ లో వేసి చికిత్స అందించడం ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యాల పైన ఎంతవరకు ప్రేముంది అనేది నిదర్శనంగా కనబడుతుందన్నారు.ప్రభుత్వ వైద్య డాక్టర్లు రోగుల పట్ల కపటి ప్రేమ చూపిస్తూ చికిత్స అందించడం చాలా దారుణం అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత స్పష్టంగా కనబడుతుంది అన్నారు..ప్రభుత్వం తక్షణమే ఖాళీలు ఉన్న స్థానంలో వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సిటీ స్కాన్ ,అల్ట్రా సౌండ్ తదితర పరికరాలు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులో సిబ్బంది కొరత లేకుండా సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి బిల్డింగ్ పూర్తిగా పరిశీలించి ఆస్పత్రిలో శిథిలాలుగా మారిన భవనాలను పునః నిర్మాణాలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న సమస్యల పరిశీలనలో ఏఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్, సిపిఐ నాయకులు మురళీకృష్ణ ,మల్లయ్య ,షబ్బీర్ ,నందు ,వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img