Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యుత్ చార్జీల పెంపును విరమించుకోవాలి : టీడీపీ

విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్రంలో విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలను తగ్గించాలని, పెంచిన విద్యుత్ చార్జీల మోతను విరమించుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏడు సార్లు విద్యుత్ చార్జీల పెంపుపై, అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు రాప్తాడు టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని గాండ్లపర్తి విద్యుత్తు సబ్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల.. అంతరాయం పై రైతులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అప్పటి ప్రభుత్వంలో నాణ్యమైన విద్యుత్‌ తక్కువ ధరతో విద్యుత్‌ సరఫరా చేసి రైతుల శ్రేయస్సు కోసం కృషి చేశారన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఏ విధంగా విద్యుత్‌ ఇస్తున్నదో, ఛార్జీలు పెరుగుదల ఇవన్నీ గ్రహించాలన్నారు. కష్టాల్లో ఉన్న నిరుపేద, పేద, మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచి భారం వేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీనా, నాయకులు గంగలకుంట రమణ, కిష్ట, సర్పంచులు మిడతల శీనయ్య, ఉజ్జినప్ప, నరేష్, ఎంపీటీసీ రవి, బోగినేపల్లి వెంకటేష్, ముత్యాలప్ప, సోషల్ మీడియా నరేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img