Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

శ్రీ వాణి కళాశాల లో లైఫ్‌ స్కిల్స్‌ పై అవగాహన

విశాలాంధ్ర` అనంతపురం : వైద్యం శ్రీవాణి కళాశాల లో ఎమ్‌ బిఏ, ఎమ్‌ సి ఏ విధ్యార్థులకు లైఫ్‌ స్కిల్స్‌ పై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్లేస్‌ మెంట్‌ సెల్‌ ఆఫీసర్‌ ఏ. సుధీర్‌ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అథిదులుగా ప్రిన్సిపాల్స్‌ భాస్కర్‌ రెడ్డి ,కే హెచ్‌ వనజమ్మ , వైవి నాగరాణి, లైఫ్‌ స్కిల్స్‌ ట్రైనర్‌ నరేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విధ్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ అవసరాల కోసం ముందుకు పోవటానికి లైఫ్‌ స్కిల్స్‌ ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు తొలిదశలోనే తమకు ఏ రంగంలో ఇష్టమో దానిని అధిగమించడానికి ఇటువంటి సెమినార్లు ఉపయోగపడతాయన్నారు . లైఫ్‌ స్కిల్స్‌ అంటే ఏమిటి వాటి అవసరం విధ్యార్థులకు ఎందుకు అంశాలు మరియు టెక్నికల్‌ విషయాలు లను చాలా అధ్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏ సాయిరాం, ఎం మాధవి, కల్పన, రవికుమార్‌, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img