Friday, April 26, 2024
Friday, April 26, 2024

సకాలంలో ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేయాలి.. ఎంఈఓ సుధాకర్ నాయక్

విశాలాంధ్ర-ధర్మవరం : ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సకాలంలో సిలబస్ను ఉపాధ్యాయులందరూ విధిగా పూర్తిచేసి, మంచి ఉత్తీర్ణత శాతానికి కృషి చేయాలని ఎంఈఓ సుధాకర్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిధిలోని నిమ్మలకుంట ఎంపీపీ ఎస్ స్కూలు, పోతుల నాగేపల్లి స్కూలు ఏపీ మోడల్ స్కూల్ ను వారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తురుత విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికను వారు పరిశీలించారు. తొలుత విద్యార్థుల యొక్క వర్క్స్ బుక్స్, మాం ను పరిశీలించడం జరిగింది. తరగతి గదిలోకి వెళ్లి సిలబస్ విషయాన్ని విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. తదుపరి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వాటిలో కొన్ని ప్రశ్నలు విద్యార్థులకు వేశారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులతో వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక ప్రణాళిక ప్రకారం చదువును నిర్ణయించుకోవాలని, కేవలం పాస్ కావడానికి కాకుండా మంచి ఉత్తీర్ణతతో రావడానికి ప్రయత్నం చేయాలన్నరు. పరీక్షలు సమీపంలో ఉన్నందున ఆటలకు స్వస్తి చెప్పి, చదువుపై ధ్యాస ఉంచాలని, అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలను పాటించాలని వారు తెలిపారు. నిబంధనల మేరకు అన్ని సదుపాయాలు విద్యార్థులకు అందించాలని ప్రిన్సిపాల్, హెచ్ఎం లను వారు ఆదేశించారు. అదేవిధంగా స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాల నిర్వహణ చేస్తూ, అనుకున్న ప్రకారం సిలబస్ పూర్తి చేసేలా హెడ్మాస్టర్ యొక్క పర్యవేక్షణ తప్పనిసరి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img