Friday, April 26, 2024
Friday, April 26, 2024

సావిత్రిబాయి పూలే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం

విశాలాంధ్ర,కదిరి.. సావిత్రిబాయి పూలే 192 వ జన్మదినం పురస్కరించుకొని కదిరి పట్టణంలో మంగళవారం బీసీ బాలికల హాస్టల్ లో సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా తాలుకా బీసీ సంక్షేమ శాఖ అధికారి గంగాద్రి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి అని,ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే సతీమణి అని అన్నారు. కుల,మతాలకు అతీతంగా విద్య అందరికి అందాలని, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి బాలికలకు విద్య నేర్పిన మొదటి మహిళా గురువు అని కొనియాడారు.వార్డెన్ సుబ్బరాయుడు మాట్లాడుతూ కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా పోరాటం చేసిన పోరాట యోధురాలు అని కొనియాడారు. మహిళ సాధికారత కోసం ,విద్యావ్యాప్తి కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందని, సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే సతీమణి గా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు నేటికీ దేశంలో మహిళలు విద్యకు, సామాజిక గౌరవాలకు దూరంగా ఉన్నారని అన్నారు. సంప్రదాయాల పేరుతో, కట్టుబాట్లతో మహిళలను సమాజానికి దూరంగా ఉంచుతున్నారని అన్నార. సావిత్రిబాయి పూలే పోరాట స్ఫూర్తితో విద్యా సామాజిక హక్కుల పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ లీలావతి, బ్రిడ్జి బీసీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సంపంగి గోవర్ధన్ కోటకొండ కృష్ణప్ప, బత్తల యుగంధర్, ప్రదీప్ కుమార్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img