Friday, April 26, 2024
Friday, April 26, 2024

సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ట్ టోర్నమెంట్ కు ధర్మవరం క్రీడాకారుడు ఎంపిక

విశాలాంధ్ర-ధర్మవరం : సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ట్ టోర్నమెంట్ ఫర్ మెన్ కు ధర్మవరం క్రీడాకారుడు కాశి గారి ప్రదీప్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ ఇటీవల ఉరవకొండలో ఎస్కే యూనివర్సిటీ తరఫున చెస్ పోటీలను నిర్వహించారనీ, దాదాపు 50 మందికి పైగా ఈ చెస్ పోటీల్లో పాల్గొనడం జరిగిందని, ఇందులో ఐదు మంది ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. తాను ఎనిమిదవ తరగతి నుంచి అనగా ధర్మవరం ఏపీ మోడల్ స్కూల్లోనే చెస్ పోటీల్లో పాల్గొనే వాడని, జిల్లాస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఉరవకొండ చెస్ పోటీలో తాను ఎంపికైన తర్వాత ఈనెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు తమిళనాడులోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. తాను బీఎస్సీ డిగ్రీ ఫైనలియర్ ను అనంతపురంలోని ఆర్ట్స్ కాల్ లో విద్యను కొనసాగిస్తున్నానని తెలిపారు. ఎస్.కె యూనివర్సిటీ తరఫున ఉరవకొండలో తాను సౌత్ జోన్కు ఎంపిక కావడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. నాతో పాటు అనగా ప్రదీప్, కార్తీక్ ,సాయి పనింద్ర, శశి కుమార్ ,వంశీకృష్ణులు తమిళనాడులో జరుగు చెస్ పోటీల్లో తప్పక తమ ప్రతిభను చాటుతామని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తదుపరి ఎస్.కె యూనివర్సిటీ వారు మమ్ములను అభినందించి శుభాకాంక్షలు కూడా తెలియజేశారని వారు తెలిపారు. అంతేకాకుండా తాను డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నప్పుడు అంతర్జాతీయ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ రేటింగ్ పాయింట్ కు కూడా ఎంపిక రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం క్రీడాకారులు,బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపి వీడ్కోలు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img