Friday, April 26, 2024
Friday, April 26, 2024

27న లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కరపత్రాలు విడుదల చేసిన క్లబ్‌ సభ్యులు
విశాలాంధ్ర`ఉరవకొండ : ఈనెల 27వ తేదీన ఆదివారం ఉరవకొండ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి, మరియు కీళ్లు, ఎముకలు కు సంబంధించిన వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు క్లబ్‌ అధ్యక్షులు సప్తగిరి మల్లికార్జున తెలిపారు. వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను బుధవారం స్థానిక క్లబ్బులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం నిర్వహణకు క్లబ్‌ ఉపాధ్యక్షులు చందా కేశన్న, కొమ్మసాని బాలచంద్ర, గణేష్‌ బాబు, లక్ష్మీనారాయణ, నజీర్‌ సాబ్‌ చిట్టా శ్రీధర్‌, ప్రభాకర్‌ నాయుడు, ఎం సి నాగభూషణం సహాయ సహకారాలను అందించడం జరిగిందని తెలిపారు. ఉరవకొండ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారు కర్నూలు కు వెళ్లాల్సి ఉంటుందన్నారు వైద్య శిబిరానికి వచ్చేవారు తమ ఆధార్‌, మరియు ఆరోగ్యశ్రీ కార్డు జత బట్టలను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img