Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల సంక్షోభంలోకి వ్యవసాయం

రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు రామచంద్రయ్య

ఉరవకొండ నుంచి రైతు గర్జన ప్రచార జాత ప్రారంభం

విశాలాంధ్ర-ఉరవకొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోయిందని దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు రామచంద్రయ్య అన్నారు. నీటి సాధన కోసం సిపిఐ మరియు ఏపీరైతు సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు గర్జన ప్రచార జాత కార్యక్రమాన్ని శనివారం ఉరవకొండలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ ప్రముఖ న్యాయవాది ఐ. రవీంద్రనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డితొ కలిసి రామచంద్రయ్య జెండాను ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 140 కోట్ల మంది ప్రజలకు అన్నం పెట్టే రైతులను ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, పంట రుణాలు, పంట నష్ట పరిహారం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారన్నారు తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం అమలు చేస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందని ప్రకటించడం శోచనీయం అన్నారు. దేశంలో పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 3500 కోట్ల తో ధరల స్థిరీకరణను ఏర్పాటు చేస్తామని చెప్పి అములు చేయలేదన్నారు. అనంతపురం జిల్లాలో వర్షాలకు పండ్ల తోటలను సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ వారికి పరిహారం ఇవ్వలేదన్నారు. తుంగభద్ర జలాశయం నుంచి కేటాయించిన నీరు రాకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు రావలసిన నీటి వాటాన్ని అడ్డుకోవడం జరిగిందన్నారు అంతేకాకుండా 54 టీఎంసీల నీటిని జల సౌర్యం చేశారని ఆరోపించారు.అక్రమంగా అప్పర్ భద్ర ప్రాజెక్టును నిర్మించడం వల్ల రాయలసీమతో పాటు బళ్లారి రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఇది అక్రమ ప్రాజెక్టు అని తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 5300 కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఈ అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి పదివేల క్యూసెక్కులు నీరు వచ్చే విధంగా సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నిలిబెట్టుకోలేకపోయారన్నారు రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలలో చైతన్యాన్ని కలిగించేందుకు ప్రచార జాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ న్యాయవాది ఐ. రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ జిల్లా రైతులకు న్యాయం జరగలేదన్నారు. జిల్లా రైతుల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం కమ్యూనిస్టు పార్టీలు అలుపెరగని పోరాటాలను నిర్వహిస్తున్నాయన్నారు. సిపిఐ పార్టీ కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ నిత్యం కరువుకోటకాలకు గురవుతున్న జిల్లా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి అన్నారు. ఉరవకొండ నియోజకవర్గం లో 55 వేలు ఎకరాలకు సాగునీటిని అందించే 980 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన డ్రిప్పు పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని, హంద్రీనీవా పనులు వేగవంతం చేయాలని పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంట రుణాలను మాఫీ చేయాలని తదితర అనేక డిమాండ్లతో జిల్లా వ్యాప్తంగా రైతు గర్జన ప్రచార జాత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈనెల 21వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు గర్జన సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, పాల్గొని జయప్రదం చేయాలన్నారు. జాత కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు రంగారెడ్డి, మధుసూదన నాయుడు సంఘీభావం తెలిపారు. జాత కార్యక్రమం ఉరవకొండ మండలంలో చిన్న ముష్టూరు, మోపిడి, ఆమిద్యాల, రాకెట్ల, కౌకుంట్ల గ్రామాలలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షులు రామాంజనేయులు, సిపిఐ పార్టీ తాలూకా కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్, రైతు సంఘం జిల్లా నాయకులు గోపాల్, సంగప్ప,నాగరాజు, సిపిఐ నాయకులు మల్లికార్జున, సుల్తాన్, నారాయణమ్మ, హనుమంతు,రమణ, కార్మిక సంఘం నాయకులు చక్రధర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img