Friday, April 26, 2024
Friday, April 26, 2024

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట

విశాలాంధ్ర – పెద్దకడబూరు : రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలలో పెద్దపీట వేశారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెద్దకడబూరులోని ఐకేపీ కార్యాలయం ఆవరణలో ఐకేపీ ఏపీఎం మహేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మూడో విడత మెగా చెక్కు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డితోపాటు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ భాగ్యమ్మ, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో 95 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం పేద పొదుపు మహిళలకు వరలాంటిదన్నారు. దీనిలో భాగంగా పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న 685 పొదుపు సంఘాలలోని 6566 మంది మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత కింద రూ.2,67,38,885 లు బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలు చేసినా అందులో మహిళలకే పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ఇంత చేస్తున్నా టీడీపీ ఓర్వలేక తన ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తుందని విమర్శించారు. 2014 – 19 టీడీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, 2019 – 2023 మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. 2014 లో టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలను బాబు గాలికి వదిలేసి, ఇప్పుడు నీతులు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇటివల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలలో విజయం సాధించిన టీడీపీ నేతలు వాపును చూసి బలుపు అనుకోవడం విడ్డూరంగా ఆరోపించారు. అందులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఓటుకు 10 కోట్లు చొప్పున వెచ్చించి రెండు ఓట్లు కొనుగోలు చేసి దొంగదారిలో విజయం సాధించడం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నమ్మితే ఇప్పుడు అమలవుతున్న పథకాలన్నీ పేదలకు అందవని గుర్తు చేశారు. అందుకే రాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డిని మహిళలు ఆదరించాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత కింద మెగా చెక్కును మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శ్రీవిద్య, జెడ్పీటీసీ రాజేశ్వరి, సర్పంచులు చంద్రశేఖర్, నాగరాజు, వైసీపీ నాయకులు గజేంద్రరెడ్డి, రవిచంద్రారెడ్డి, రఘురామ్, పూజారి ఈరన్న, శివరామిరెడ్డి, జాము మూకయ్య, ముక్కరన్న, అర్లప్ప, ఐకేపీ ఏరియా కో ఆర్డినేటర్ జనార్దన్, సీసీలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img