విశాలాంధ్ర – ఉరవకొండ : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి సాగనంపాలని దేశాన్ని కాపాడుకోవాలని 14 నుంచి 30 వరకు సిపిఐ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రచార బేరి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను గురువారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీల నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ ప్రజల మధ్య మత విద్వేషల ను రాజేస్తుందని ఆరోపించారు. అంతే కాకుండా ఆదాని, అంబానీ లాంటి సంపన్నులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని పేర్కొన్నారు.అవినీతి అక్రమాలను ప్రశ్నించే వారందరిపై కూడా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్నో దుర్మార్గాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రశ్నించే స్థాయిలో లేకపోవడం శోచనీయమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు సిపిఐ సీపీఎం పార్టీలు చేపట్టిన ఈ ప్రచార భేరి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించడానికి సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ తాలూకా కార్యదర్శి జె. మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్, ఉరవకొండ కార్యదర్శి మల్లికార్జున, వజ్రకరూరు కార్యదర్శి, సుల్తాన్, విడపనకల్లు కార్యదర్శి రమేష్, కూడేరు కార్యదర్శి నారాయణమ్మ, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు రమణ మల్లేష్, గణప మల్లికార్జున, సిపిఎం నాయకులు మధుసూదన్ నాయుడు, సీనప్ప, మహిళా సంఘం నాయకులు నాగలక్ష్మి, నూర్జహాన్ వన్నూరమ్మ తదితరులు పాల్గొన్నారు.