Friday, April 26, 2024
Friday, April 26, 2024

ధోబిఘాట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి

రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి లింగమయ్య డిమాండ్

విశాలాంద్ర , కళ్యాణదుర్గం : రజక వృత్తిదారులు ఉపయోగిస్తున్న దోబీఘాట్లకు ఉచిత విద్యు త్ ఇవ్వాల్సిందేనని రాష్ట్ర రజక వృత్తిదారుల సమాఖ్య కార్యదర్శి లింగమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో గురువారం పర్యటించిన పలుచోట్ల రజక వృత్తిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు . రజక వృత్తి చేస్తున్న వారికి దోబీఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన బోరు బావులకు మోటార్లు బిగించారని, వీటికి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ లే విద్యుత్తు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే బెలుగుప్ప మండలం శీర్పి కొట్టాల. గ్రామంలో విద్యుత్ ఛార్జీలను స్థానిక రజకుల వద్ద వసూలు చేయడం విస్మయం కలిగించిందన్నారు. గ్రామంలో రజక వృత్తిదారులు తమ దృష్టికి స్థానిక సమస్యను తీసుకువచ్చారని ఇదే విషయంపై కళ్యాణదుర్గం విద్యుత్ శాఖ డి.ఈ. శేషాద్రి శేఖర్ ని కలిసి వివరించగా జీవో ప్రకారం ధోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉందని అయితే శీర్పి కొట్టాల గ్రామంలో తమ వృత్తిదారుల నుంచి విద్యుత్ ఛార్జీలు కట్టించుకుంటున్నారని ఫిర్యాదు చేయడం పై స్పందించారన్నారు. వెంటనే మండల అధికారులకు సమాచారం అందించి ధోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారులు ఈశ్వరయ్య, సన్నప్పయ్య, నారాయణస్వామి, పుల్లప్ప, నాగభూషణం, నాగేంద్ర ,శంకరయ్య లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img