Friday, April 26, 2024
Friday, April 26, 2024

నాసిరకంగా ప్రభుత్వ గృహ నిర్మాణాలు : పట్టించుకోని అధికారులు

విశాలాంధ్ర-తాడపత్రి : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మూడవ ఆప్షన్ క్రింద జగనన్న గృహ నిర్మాణాలు చేపట్టింది. ఈ బృహత్ కార్యాన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పింది. అందులో భాగంగానే పట్టణంలో నివసించే పేద ప్రజలకు పుట్లూరు రోడ్డు లోని ఆర్డిటి కాలనీ, సజ్జలదిన్నె-1, సజ్జలదిన్నె-2, ఎర్రగుంటపల్లి గ్రామంల వద్ద మూడవ ఆప్షన్ క్రింద దాదాపు 1628 కుటుంబాలకు జగనన్న గృహాలు నిర్మిస్తున్నారు. ఈ గృహాలు నిర్మాణం నాణ్యత లేకుండా, నాసిరకంగా ప్రైవేట్ కంపెనీ నిర్మిస్తున్నది. ఈ బృహత్కార్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ గృహాలు నిర్మించే సమయంలో సంబంధిత అధికారులు పరవేక్షించవలసిన ఉంటుంది. సర్వ సాధారణంగా గృహాలు నిర్మించాలంటే పునాదులు వేయడానికి సచుమట్టి తొలగిస్తారు. చదునుగా ఉంచి పునాదులు వేస్తారు.ఇక్కడ దీనికి విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీ వారు ఇష్టానుసారం జగనన్న గృహ నిర్మాణాలు చేపట్టారు. అంతే కాకుండా వర్క్ ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు లేని సమయంలో కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. వీటన్నిటిని పర్యవేక్షించి నాణ్యతగా జగనన్న గృహాలు నిర్మించి పేదలకు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఎంతో ఉంది. కానీ దీనికి విరుద్ధంగా అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్య మేమిటో దీన్ని చూసిన ప్రజలు, గృహ లబ్ధిదారుల మదిలో ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ గృహాలు నాణ్యత లేకుండా నాసిరకంగా నిర్మిస్తే రాబోవు రోజుల్లో అధిక వర్షాలు, భూకంపాలు సంభవించిన ప్పుడు ఈ గృహాలలో నివసించే పేద ప్రజల కుటుంబాల ప్రాణాలు గాలిలో కలిపసిపోవాల్సిందే నానని పలువురు ప్రజలు బహిర్గంగా చర్చించు కుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉన్నతాధి కారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నాణ్యతగా జగనన్న గృహాలు నిర్మించి ఇవ్వాలని పలువురు ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img